Header Banner

గోదావరిలో 8 మంది గల్లంతు! కొనసాగుతున్న గాలింపు చర్యలు..వారి వివరాలు !

  Tue May 27, 2025 10:30        Others

కోనసీమలో విషాదం.. సోమవారం సాయంత్రం గోదావరి నదిలో స్నానానికి వెళ్లిన ఎనిమిది మంది యువకులు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న స్థానికులు, పోలీసులు, సహాయక బృందాలు నది వద్దకు చేరుకుని గల్లంతయినవారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఒక మృతదేహం లభ్యం కాగా మిగిలినవారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

 

ముమ్మిడివరం వద్ద గోదావరిలో (Godavari River) స్నానానికి వెళ్లి ఎనిమిది మంది యువకులు గల్లంతయిన (8 Youth Missing) వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదం జరిగిన ప్రాంతం సమీపంలో ఒక మృతదేహం లభ్యమైంది. అది వడ్డే మహేష్‌గా గుర్తించారు. ఇంకా ఏడుగురి యువకుల ఆచూకీ లభ్యం కాలేదు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. తెల్లవారు వరకు ఫ్లడ్ లైట్లు (Floodlight).. గజ ఈత గాళ్ళు.. వలల సాయంతో అధికారులు గోదావరిని జల్లెడ పట్టారు. గల్లంతయిన ఎనిమిది మందిలో నలుగురు రెండు కుటుంబాలకు చెందిన సొంత సోదరులు. దీంతో యువకుల కుటుంబాల్లో విషాదం నెలకొంది.

 

ఇది కూడా చదవండి: ఇండియాని వణికిస్తున్న కరోనా! గుంటూరులో కరోనా పాజిటివ్ కేసులు!

 

శుభకార్యానికి వచ్చి..

 

కె.గంగవరం మండలం శేరిలంకకు చెందిన కొండేపూడి నాగరాజు-చిన్నారి దంపతుల కుమార్తె ప్రేమజ్యోతి రజస్వల వేడుకకు ఆమె సోదరుడు పోలిశెట్టి అభిషేక్‌ ఆహ్వానంపై వివిధ ప్రాంతాలకు చెందిన మిత్రులు, బంధువులు హాజరయ్యారు. అందరూ సరదాగా వేడుకలో పాల్గొని విందు భోజనాలు ఆరగించిన తరువాత సరదాగా గౌతమి గోదావరిలో స్నానం చేసేందుకు 11 మంది మిత్రులు వెళ్లారు. బట్టలు, చెప్పులు, షూలు, సెల్‌ఫోన్లను ఒడ్డున పెట్టి స్నానానికి ఉపక్రమించారు. తొలుత ఒక యువకుడు స్నానానికి దిగాడు. ఒడ్డున స్నానం చేయడం వీలు పడకపోవడంతో కొంచెం ముందుకు వెళ్లేసరికి లోతుగా ఉండడంతో మునిగిపోయా డు. అది గ్రహించిన మరో ముగ్గురు అతడిని రక్షించేందుకు గోదావరిలోకి వెళ్లారు. వారు కూడా మునిగిపోతుండడంతో మరో ఇద్దరు ఇలా ఒకరి తరువాత ఒకరు నదిలోకి వెళ్లి గల్లంతయ్యారు. ఆపదను గ్రహించిన కాకినాడకు చెందిన దాసరి కరుణకుమార్‌ (17), మేడిశెట్టి చరణ్‌రోహిత్‌ (20), కనికెళ్ల సురేష్‌ (19) సురక్షితంగా బయటపడ్డారు. సాన్నానికి వెళ్లిన 11 మందిలో ఎనిమిది మంది గల్లంతయ్యారు. కరుణకుమార్‌ స్థానికులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన అందరూ ఆ ప్రాంతానికి చేరుకున్నారు. జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు ఆధ్వర్యంలో పోలీసు అధికారులు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గల్లంతైన వారి ఆచూకీ కోసం ఇంజను పడవలపై గాలింపు చర్యలు చేపట్టారు. ప్రత్యేక బృందాలను రప్పించారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు చేరుకుని గౌతమి నదిలో గాలింపు చర్యలు చేపట్టాయి.

 

గల్లంతైన వారి వివరాలు...

కాకినాడ జగన్నాథపురం ప్రాంతానికి చెందిన సబిత క్రాంతి ఇమ్మానియేలు(19), సబిత పాల్‌ (18), తాతిపూడి నితీష్‌ (18), ఎలుమర్తి సాయి (18), మండపేటకు చెందిన రోహిత్‌ (18), శేరిలంక ప్రాంతానికి చెందిన ఎలిపే మహేష్‌ (14), ఐ.పోలవరం మండలం ఎర్రగరువుకు చెందిన అన్నదమ్ములైన వడ్డే మహేష్‌ (16), వడ్డే రాజేష్‌ (14) గల్లంతయ్యారు. ఒకరి మృత దేహం లభ్యం కాగా మిగిలినవారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

 

ఇది కూడా చదవండి: ఏపీలో మరో గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే.. రూ.1400 కోట్లతో..! ఆ రూట్లోనే, కేంద్రం గ్రీన్ సిగ్నల్!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ పోలీసు బాస్‌గా అయన నియమకం! ఇక పూర్తిస్థాయి డీజీపీ!

 

సిరిసిల్లలో ముదిరిన ప్రోటోకాల్ వివాదం..! నేతల అరెస్టుతో ఉద్రిక్తత!

 

అవును ఆ ఇంటికి వెళ్లాను..! వైసీపీ వీడియోపై విజయసాయి రెడ్డి సంచలన ట్వీట్!

 


లోకేశ్​కు పార్టీలో ఆ పదవి.. జోరుగా చర్చ! జీవీ, ఆనం కీలక వ్యాఖ్యలు!


ప్రపంచంలో టాప్-10 వైమానిక దళాలు ఇవే! భారత్ స్థానం ఎక్కడంటే?


కేసీఆర్ కు కవితకు మధ్య గ్యాప్ వెనుక కారణం ఇదే! చేసింది అంతా ఆయనే!


ప్రధాని మోదీ అధ్యక్షతన ఎన్డీయే సీఎంలు, డిప్యూటీ సీఎంల భేటీ.. చేసిన తీర్మానాలు ఇవే!


జంట హత్యల కేసులో ఊహించని ట్విస్ట్.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రదర్స్ పై కేసు నమోదు!


రెండు రోజుల పోలీస్‌ కస్టడీకి పీఎస్ఆర్‌, మధు! ఆంజనేయులపై ప్రశ్నల వర్షం..


ప్రధానికి కృతజ్ఞతలు తెలియజేసిన ఏపీ సీఎం చంద్రబాబు.. ఇవాళ మన్ కీ బాత్ కార్యక్రమం!


వైసీపీకి మరో భారీ షాక్! ఏపీ పోలీసుల అదుపులో మాజీ మంత్రి!


నిరుద్యోగులకు గుడ్ న్యూస్! నెలకు 2 లక్షల జీతంతో.. భారీ నోటిఫికేషన్!


ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #BreakingNews #LatestUpdate #RescueOperations #MissingPersons #TragicIncident